అనురాగ్ బసు ని కలిసిన కార్తీక్ ఆర్యన్
on Apr 1, 2023
కొన్ని సినిమాలకు, కొన్ని కథలకు ఎక్స్ పయరీ డేట్ ఉండదు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఆ కథల మీద మనసు పడుతూనే ఉంటారు జనాలు. అలాంటి సినిమా కథల్లో ఆషికీ ఒకటి. అప్పుడెప్పుడో 1990లో మొదలైన ఈ కథకు ఇప్పటికీ ఆడియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. పాపులర్ రొమాంటిక్ ఫ్రాంచైజీ ఆషికి త్రీక్వెల్ ఉంటుందని ఇటీవల టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్న త్రీక్వెల్ ఆషికి3. భూల్ భూలయ్యా 2 సక్సెస్ తర్వాత కార్తీక్ ఏ సినిమాలో నటిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఆషికీ త్రీక్వెల్‌లో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా తేలాల్సి ఉంది, అయినా ఆషికి త్రీక్వెల్ మూలన పడిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని కార్తీక్ ఆర్యన్ చెప్పకనే చెప్పేసారు. ఈ ఏడాది ఆషికీ 3 సెట్స్ మీదకి వెళ్లనుంది. సత్య ప్రేమ్ కి కథ సినిమాను పూర్తి చేసిన తర్వాత ముంబైకి వచ్చారు కార్తీక్ ఆర్యన్. ఆయన ఇప్పుడు నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనురాగ్ బసుని కలిశారు. ఫిలిం ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ని కూడా కలిశారు. `ఆషీకీ 3 ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కార్తీక్ అనురాగ్ కలిసి ఆషికీ త్రీ గురించి మాట్లాడుకున్నారు. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరు చేస్తారనే విషయం మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. కార్తీక్ మిగిలిన ప్రాజెక్ట్ లతో కూడా బిజీగా ఉన్నారు.
అటు అనురాగ్ కూడా మెట్రో ఇన్ డీనో సినిమాతో బిజీగా ఉన్నారు . అయినా కూడా ఆషికి త్రీ పనులు కూడా మరోవైపు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి`` అన్నది భూషణ్ తరఫునుంచి వినిపిస్తున్న మాట. ఆషికి సినిమా 1990లో తెరకెక్కింది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వల్ గా ఆదిత్య రాయ్‌కపూర్ 2013లో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఆషికీ 3 లో కార్తిక్ ఆర్యన్ నటించనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
